Event-Date: | 26-Jan-2019 |
Level: | Local |
Topic: | Miscellaneous(General) |
రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ‘బాబూ జగ్జీవన్‌రామ్ సమతా స్ఫూర్తి వనం’ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని నిర్మాణానికి ఏపీఐఐసీని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించింది.
నిర్మాణాన్ని 4 దశల్లో చేపట్టాలని, మొత్తం 16 నెలల్లో పూర్తిచేయాలని సూచించింది. నిర్మాణాల ఆకృతుల ఖరారు, ప్రాజెక్టు అంచనాలను రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు వ్యవహరిస్తారని పేర్కొంది.
ప్రాజెక్టులో భాగంగా నిర్మించేవి:
* బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం
* వివిధ కళాకృతులతో కూడిన మెమోరియల్ పార్క్, ల్యాండ్ స్కేప్ గార్డెన్
* ‘సమతాసదన్’ పేరుతో వెయ్యి మంది ఒకేసారి వీక్షించేందుకు వీలుగా బహుళప్రయోజన సమావేశ మందిరం
* ‘స్ఫూర్తిభవన్’ పేరుతో బహుళ ప్రయోజన భవంతి