Current Affairs Telugu Daily

ప్రణబ్‌ముఖర్జీ, నానాజీ, హజారికాలకు భారతరత్న
కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 25న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, భారతీయ జనసంఘ నేత నానాజీ దేశ్‌ముఖ్‌, గాయకుడు భూపేన్‌ హజారికాలకు భారతరత్న పురస్కారాలను ప్రకటించింది.
  • నానాజీ, హజారికా పేర్లను మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. నాలుగేళ్ల విరామం అనంతరం భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. చివరిసారిగా 2015లో మోడి ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్‌మోహన్‌ మావీయకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
  • ఇప్పటిదాకా భారతరత్న పొందిన వారి సంఖ్య 48కి చేరింది. 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 11 మంది విదేశీయులు సహా 112 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. ఇందులో నలుగురిని పద్మవిభూషణ్‌, 14 మందిని పద్మభూషణ్‌, 94 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
నలుగురికి పద్మవిభూషణ్‌..
  • యెమెన్‌ నుంచి భారతీయులతోపాటు, వివిధ దేశాల వారిని రక్షించడంలో కీలకపాత్ర పోషించిన డిజిబౌటి అధ్యక్షుడు ఇస్మాయిల్‌ ఒమర్‌ గుయెల్లె, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జానపద గాయని తీజన్‌బాయి, మహారాష్ట్రకు చెందిన ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఏఎం నాయక్‌, మహారాష్ట్రకు చెందిన రంగస్థ కళాకారుడు బల్వంత్‌ మొరేశ్వర్‌ పురందరెలకు పద్మవిభూషణ్‌ పురస్కారాలు ప్రకటించింది.
14 మందికి పద్మభూషణ్‌..
  • మలయాళ నటుడు మోహన్‌లాల్‌, తప్పుడు కేసుల్లో ఇరుక్కొని చివరికి సుప్రీంకోర్టు కోర్టు ద్వారా నిర్దోషిగా విడుదలైన అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్‌, దివంగత పాత్రికేయుడు కుదీప్‌ నయ్యర్‌, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, ప్రస్తుత ఎంపీ కరియాముండా, 6 సార్లు పార్లమెంటుకు ఎంపికైన భాజపా ఎంపీ, కేంద్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌, అకాలీదళ్‌ నేత, మూడుసార్లు ఎంపీ, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా, ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకులు, సీఈఓ మహాశయ్‌ ధర్మపాల్‌, పర్వతారోహకురాలు బచేంద్రీపాల్‌, మాజీ కాగ్‌ వీకే షుంగ్లూకు పద్మభూషణ్‌ పురస్కారాలు దక్కాయి.
  • ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, దివంగత బాలీవుడ్‌ నటుడు కాదర్‌ఖాన్‌, భారత క్రికెట్‌ క్రీడాకారుడు గౌతంగంభీర్‌, మాజీ రాయబారి జైశంకర్‌ పద్మశ్రీ వరించిన ప్రముఖుల్లో ఉన్నారు.
నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ..
  • తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్‌ సాధించిన సునీల్‌ ఛెత్రి, 3 వేలకు పైగా సినీగీతాలు రాసిన సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దశాబ్దకాలంగా చెస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ‘రైతునేస్తం’ ఫౌండేషన్‌ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams