Current Affairs Telugu Daily

దివాలా స్మృతి రాజ్యాంగబద్ధమే: సుప్రీం
దివాలా స్మృతి(ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌-ఐబీసీ)పూర్తిగా రాజ్యంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • రుణాల ఎగవేతలకు ఇక కాలం తీరిందని, ఆర్థిక వ్యవస్థను ఈ స్మృతి బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది.ఈ మేరకు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హ ధర్మాసనం 2019 జనవరి 25న 150 పుట తీర్పును వెలువరించింది.
  • గతంలో రుణగ్రహీతలు న్యాయస్థానాలను ఆశ్రయించి, తాము దివాలా తీసినట్టు నివేదించేవారు. అయితే... ఐబీసీ నిబంధన ప్రకారం రుణదాతలే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తమ బకాయిదారులను దివాలా తీసినట్టుగా ప్రకటించాలని కోరేందుకు వీలవుతుంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద సెక్షన్‌ 29ఏ రాజ్యాంగ బద్ధతను సవాలుచేస్తూ పలు సంస్థలు వ్యాజ్యాలను దాఖలు చేశాయి.
  • వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం... ఐబీసీ ఆద్యంతం రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిపుణులు కమిటీ ఈ స్మృతి అమలును పర్యవేక్షిస్తోందని, అందరి సూచనను పరిగణనలోకి తీసుకుని తక్కువ వ్యవధిలోనే దీనికి సంబంధించి సవరణలు కూడా చేసిందని పేర్కొంది.

views: 858

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams