Current Affairs Telugu Daily

ఏపీలో ఫెడరేషన్‌ స్థానంలో కార్పొరేషన్లు 
వెనుకబడిన వర్గాలకు మరింత సాయం అందిచేందుకు 11 బీసీ సమాఖ్యలను కార్పొరేషన్లుగా మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • దీంతోపాటు బీసీల్లోని మరికొన్ని వర్గాల సంక్షేమానికి కొత్తగా యాదవ, కురుమ, శెట్టిబలిజ, చేనేత కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
  • ప్రస్తుతమున్న ఫెడరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం ఇస్తున్నా.. వాటి ఫలాలు కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి.
  • ఫెడరేషన్లకు ఉన్న పరిమితి దృష్ట్యా ప్రభుత్వ సాయం ఎక్కువ మందికి చేరడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్లను కార్పొరేషన్లగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 
  • ప్రస్తుతమున్న 11 ఫెడరేషన్ల ద్వారా ఆయా వర్గాల వారికి వ్యక్తిగత రుణాలిచ్చే వెసులుబాటు ఉండదు. 
  • కనీసం 10 నుంచి గరిష్ఠంగా 15 మంది సభ్యులు కలిసి ప్రాథమిక సంఘంగా ఏర్పడి సహకార చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సంఘం ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉండాలి. 
  • కేవలం స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఆర్థిక సాయం అందించేందుకు మాత్రమే ప్రభుత్వం ఫెడరేషన్లకు నిధులిస్తుంది. 
  • గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ఎక్కువగా అవగాహన ఉండడం లేదు. నమోదు చేసుకోవడంలో ఉన్న క్లిష్టత దృష్ట్యా ఎక్కువ మంది ఫెడరేషన్ల సాయానికి దూరంగానే ఉండిపోతున్నారు. 
  • స్వయం ఉపాధి కోసం వ్యక్తిగత, బృంద రుణాలు ఇచ్చే అధికారం కార్పొరేషన్లకు ఉంటుంది 
  • ప్రభుత్వ కార్యక్రమాలను కార్పొరేషన్ల ద్వారా నేరుగా అమలుచేయొచ్చు 
ఆయా వర్గాల సంక్షేమం కోసం కొత్త పథకాలకు రూపకల్పన చేసే అధికారం ఉంటుంది. కార్పొరేషన్లను కంపెనీ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. 
ప్రస్తుతమున్న ఫెడరేషన్లు 
రజక 
నాయిబ్రాహ్మణ 
వడ్డెర 
సగర(ఉప్పర) 
కృష్ణ బలిజ 
శాలివాహన 
మేదర 
బట్రాజ 
కల్లుగీత కార్మికులు 
విశ్వబ్రాహ్మణ 
వాల్మికీ(బోయ)

views: 895Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams