Current Affairs Telugu Daily

వచ్చే 10-15 సం" లో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తి గా భారత్‌ : వెంకయ్యనాయుడు
వచ్చే 10-15 ఏళ్లలో ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో భారత్‌ ఒకటిగా అవతరించనుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. చెన్నైలో రెండు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎం-2019) ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి సాధ్యమని, ఆ రకమైన సంబంధాలను తమిళనాడు కొనసాగిస్తోందని చెప్పారు
* తమిళనాడులో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సదస్సులో ప్రతిపాదనలు జరిగాయి
* అన్నింటిలోకి చొచ్చుకొచ్చిన ప్లాస్టిక్‌
పలు రంగాల్లో ప్లాస్టిక్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చిందని , లాభం, నష్టం రెండూ ఉన్న దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీఐపీఈటీ) స్వర్ణోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రశంసించారు
*దేశంలో ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ పది శాతం వృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ వెల్లడించారు.
 2020కి దేశంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తులు 2.3 కోట్ల టన్నులకు చేరుకుంటాయని వెల్లడించారు. ఇతర దేశాల్లో ప్లాస్టిక్‌ కిలో ధర రూ.28 ఉంటే మన దేశంలో రూ.11గా ఉందన్నారు.
* ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి తిరిగి వినియోగించే ప్రక్రియలో సీఐపీఈటీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams