Current Affairs Telugu Daily

లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ కు " అశోక చక్ర"
విద్వేష భావజాలానికి ప్రేరేపితుడై ఉగ్రవాదిగా మారిన వ్యక్తి "లాన్స్‌ నాయక్‌ నజీర్ అహ్మద్ వనీ" తప్పు తెలుసుకొని సైన్యంలో చేరి, తుదికంటా పోరాడి దేశం కోసం ప్రాణాలు విడిచారు. 
*ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన్ను సైన్యంలో అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించనున్నారు. 
* దేశం ఆయన సేవలు గుర్తించి, గౌరవిస్తున్నందుకు ఆయన కుటుంబం చాలా ఆనందంగా ఉంది. అయితే అధికారులు వచ్చి వెల్లడించే వరకూ ఇలాంటి అవార్డు ఒకటుంటుందని ఉందని కూడా ఆ కుటుంబానికి తెలియదనే విషయాన్ని ఆయన భార్య మహాజబీన్ వెల్లడించారు. 
*ఒకవైపు ఉగ్రవాదుల నుంచి బుల్లెట్ వర్షం కురుస్తున్నప్పటికీ, ఆయన ఎల్‌ఈటీ జిల్లా కమాండర్‌, ఓ ఉగ్రవాదిని హతమార్చారు. మరణం అంచులకు చేరినా, మరో ఉగ్రవాదిపై వీరోచితంగా పోరాడారు . 2004లో టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో చేరి, సైన్యంలోకి అడుగు పెట్టారు. 2007, 2018లో సేనా పతకాన్ని కూడా అందుకున్నారు.

అశోక చక్ర:  
అశోక చక్ర (Ashoka Chakra) అనేది భారతదేశంలో యుద్ధ రంగంలో కాకుండా( శాంతి సమయం లో) ఇతర ప్రదేశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే ఒక పురస్కారం.
1952 Naik Nar Bahadur Thapa (gorkha rifles) కు
మొదటి సారి బహూకరించారు.

views: 745

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams