Current Affairs Telugu Daily

నెల్లూరు, కరీంనగర్‌ జిల్లాలకు బేటీ బచావో.. బేటీ పడావో అవార్డు
బాలికల విద్య, సంరక్షణ అంశాల్లో మెరుగైన పనితీరు కనపరిచినందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి నెల్లూరు, కరీంనగర్‌ జిల్లాకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అవార్డును అందజేసింది.
  • బేటీ బచావో.. బేటీ పడావో(BBBP) కార్యక్రమం ప్రారంభించి 4 సం॥లు పూర్తయిన సందర్భంగా బాలికల జననా పెంపు, బాలికల ప్రాధాన్యం పెరిగే వాతావరణ కల్పన అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 25 జిల్లాలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
  • డిల్లీలో 2019 జనవరి 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, నెల్లూరు ఐసీడీఎస్‌ పథక సంచాలకురాలు సరోజిని, ఆయా జిల్లా ఐసీడీఎస్‌ అధికారులకు ఈ అవార్డులు అందజేశారు.
బేటీ బచావో-బేటీ పడావో  : 
ప్రారంభం    :     2015 జనవరి 22
ఉద్దేశం     :     బాలికల పట్ల వివక్షతను తొలగించడం, భ్రూణ హత్యలను అరికట్టేలా ప్రజలను చైతన్యపరచడం, బాలికల             విద్యను ప్రోత్సహించడం
ముఖ్యాంశాలు     :     
-    హర్యానాలోని పానిపట్టు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 
    -    ఈ పథకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ బాలివుడ్‌ నటి మాధురీదీక్షిత్‌ నియమించబడ్డారు. ప్రస్తుతం సాక్షి మాలిక్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది
    -    ఈ కార్యక్రమం కింద సుకన్య సమృద్ధి యోజనను బాలికల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికింద పదేళ్లలోపు బాలికల పేరిట రూ.1000 కనీస మొత్తంతో బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాను తెరవవచ్చును. ఈ ఖాతాలో జమ చేసే సొమ్ముపై వాటా 9.2% వడ్డీ, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 
    -    ప్రస్తుతం రూ.250తో బ్యాంకులో లేదా పోస్టాఫీసులో ఖాతాను తెరువవచ్చును. 
BBBP -Beti Bachao Beti Padhao

views: 860

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams