Current Affairs Telugu Daily

వెనెజులాలో రాజకీయ సంక్షోభం
దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులా దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్‌ గుయాడో(35) 2019 జనవరి 23న రాజధాని కారకస్‌లో ప్రజల సమక్షంలో ప్రకటించుకున్నారు.
  • అధ్యక్షుడిగా జువాన్‌ గుయాడోను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగు దేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి.
  • అధ్యక్షుడు నికోస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చులు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది.
  • చమురు నిల్వ అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజువెలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు.
  • పరిస్థితులను గమనించిన విపక్ష నేత గుయాడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు.
  • దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది.
  • వెనెజువెలా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపించింది. దేశంలో జరిగిన అల్లర్లలో 13 మంది మృతి చెందారు.

views: 784

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams