Current Affairs Telugu Daily

యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌ 
ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌ తదుపరి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియమితులయ్యారు.
  • యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక సీఈఓ రాణా కపూర్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. రాణా కపూర్‌ పదవీకాలం 2019 జనవరి 31తో ముగియనుంది.
  • కొత్త ఎండీ, సీఈఓగా రవ్‌నీత్‌సింగ్‌ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1 లేదా అంతకంటే ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 
  • రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ ప్రస్తుతం డాయిష్‌ బ్యాంక్‌ ఇండియా హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 1991 నుంచి ఆయన డాయిష్‌ బ్యాంక్‌లో కొనసాగుతున్నారు. బ్యాంకింగ్‌ పరిశ్రమలో గిల్‌ దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది.
  • 1991లో డాయిష్‌ బ్యాంక్‌ ప్రైవేట్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో చేరిన ఆయన.. 1993లో కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ విభాగానికి మారారు. క్యాపిటల్‌ మార్కెట్లు, ట్రెజరీ సొల్యూషన్ల విభాగాలకు నేతృత్వం వహించారు.
  • గిల్‌ సామర్థ్యాన్ని గుర్తించిన బ్యాంక్‌ 2012లో కంట్రీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి కల్పించింది. హిందు కాలేజీ, డిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గిల్‌ మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. 

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams