Current Affairs Telugu Daily

డిల్లీలో జైద్‌ పంటలపై తొలి సదస్సు
జైద్‌ పంటలకు సంబంధించిన వివిధ అంశాలపై మొదటిసారిగా డిల్లీలో 2019 జనవరి 24న జాతీయ సదస్సు నిర్వహించారు.
  • వ్యవసాయ భూమిని గరిష్ఠంగా సద్వినియోగం చేస్తూ రైతులు విస్తృత ప్రయోజనాలు పొందడమెలాగో ఈ సదస్సులో చర్చించారు.
  • వ్యవసాయ శాఖ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు రైతులు హాజరయ్యారు.
  • కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
  • 2020 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. రబీ, ఖరీఫ్‌ పంట కాలాల మధ్య ఉండే మరో పంటకాలమే జైద్‌. 

views: 716

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams