Current Affairs Telugu Daily

జన్యు ఎడిటింగ్‌ కోతిపై క్లోనింగ్‌తో 5 కోతులు సృష్టి
జన్యు ఎడిటింగ్‌ విధానం ద్వారా పుట్టిన ఒక కోతిని క్లోన్‌ చేసిన చైనా శాస్త్రవేత్తలు 5 ప్రతిరూపాలను సృష్టించారు. వీటిలో పలు మానవ రుగ్మతలను చొప్పించారు.
  • ఈ కోతులు వైద్య పరిశోధనకు ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. జన్యు ఎడిటింగ్‌ విధానం ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చినట్లు 2018 నవంబర్‌లో చైనా పరిశోధకుడొకరు చేసిన ప్రకటన తీవ్ర విమర్శకు దారితీసింది.
  • మానవ జీవక్రియ గడియారంలో(సర్కాడియన్‌ రిథమ్‌) లోపాలు ఉండేలా జన్యు ఎడిటింగ్‌తో ఒక కోతిని తమ శాస్త్రవేత్తలు రూపొందించారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.
  • దాని నుంచి మరో 5 కోతులను వారు సృష్టించారని తెలిపింది. జన్యుమార్పిడి చేసిన కోతి నుంచి వైద్య పరిశోధన కోసం ఇన్ని ప్రతిరూపాలను క్లోన్‌లు చేయడం ఇదే మొదటిసారని వివరించింది.
  • ఇవి షాంఘైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో జన్మించాయని పేర్కొంది. సర్కాడియన్‌ రిథమ్‌లోని లోపాలకు నిద్రలేమి, కుంగుబాటు, మధుమేహం, క్యాన్సర్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధులతో సంబంధం ఉంది.
  • గతంలో ఇలాంటి వ్యాధులపై పరిశోధన కోసం ఎలుకు, ఈగను ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే దినచర్యలు, మెదడు నిర్మాణం, జీవక్రియ రేటు వంటి అంశాల్లో ఈ జీవులకు మానవులకు మధ్య చాలా వైరుద్ధ్యం ఉంటోంది.
  • తాజా క్లోనింగ్‌లో జన్మించిన కోతుల శరీర అంతర్గత తీరుతెన్నులు చాలా వరకూ మానవులను పోలి ఉన్నాయి.
  • అందువల్ల అనేక వ్యాధులకు చికిత్స విధానాలను రూపొందించడానికి ఇవి మెరుగైన నమూనాలుగా పనికొస్తాయని జిన్హువా పేర్కొంది. ఫలితంగా మందు అభివృద్ధి ఖర్చు తగ్గుతాయని వివరించింది.

views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams