Current Affairs Telugu Daily

డోకా లా కనుమ తమదేనని చైనా మ్యాప్‌ 
సిక్కిం సెక్టార్‌లో ఉండే డోకా లా కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు డోకా లా కనుమ వద్దకే వెళ్లారు. కొన్ని రోజుల క్రితం భారత్‌, చైనా సైనికులు డోకా లా కనుమ వద్దనే కలబడ్డారు. డోకా లా కనుమను చైనా డాంగ్లాంగ్‌ అని పిలుస్తుంది. ఈ ప్రాంతం భారత్‌, చైనా, భూటాన్‌.. మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా డోకా లా కనుమను తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీన్ని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో చైనీయులు తమ పశువుకు గడ్డి మేపుతున్నారని, ఒకప్పుడు భూటాన్‌ ప్రజలు ఇక్కడ గడ్డికి రావాంటే అప్పటి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండేదని చైనా పేర్కొంది. డోకా లా కనుమ తమదే  అని చెప్పడానికి ఈ రుజువు సరిపోతాయని చైనా వాదిస్తోంది.
views: 1080



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams