Current Affairs Telugu Daily

భారతీయులకు వేతన వివక్ష
శ్వేత జాతీయులతో పోలిస్తే భారత్, ఆసియా, ఆఫ్రికన్‌ అమెరికన్లకు ఒరాకిల్ కంపెనీ 25 శాతం తక్కువ జీతాలు చెల్లిస్తోందని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ లేబర్ ఆరోపించింది. 
* ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్థానాలకు ఆసియన్లలో భారతీయులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, జీతాల విషయంలో మాత్రం ఆఫ్రికన్లు, హిస్పానిక్స్‌తో పాటే తక్కువ జీతాన్ని అందిస్తుందని తెలిపింది.
* ఆ కంపెనీ  అమెరికన్‌ కార్యకలాపాల్లో ముఖ్యంగా ఈ వివక్షకను చూపుతుంది. ‘సమాన ఉద్యోగావకాశాలు కల్పించి, శ్వేత జాతీయులతో పోల్చుకుంటే తక్కువ మొత్తాన్ని చెల్లిస్తుంది’ అని డిపార్ట్ మెంట్‌ ఆఫ్ లేబర్ తన ఫిర్యాదులో ఆరోపించింది. 
* జనవరి 2013 నుంచి డిసెంబరు 2016 మధ్యలో శ్వేతజాతీయులు కానీ వారు 400 మిలియన్ డాలర్ల జీతాన్ని కోల్పోయారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివక్ష 11,000 ఆసియన్ జాతీయుల మీద ప్రభావం చూపిందని తెలిపింది. 
Oracle CEO:  Mark Hurd  
* ఇటీవల ఒరాకిల్ సంస్థ దేశంలో   మొదటి డాటా సెంటర్ ను ముంబై లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

views: 666

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams