Current Affairs Telugu Daily

పీఎస్‌ఎల్వీ సీ44 ప్రయోగం విజయవంతం
* నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ - సీ44 ప్రయోగం విజయవంతమైంది. విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్‌ను, మైక్రోశాట్‌ను  పీఎస్‌ఎల్వీ సీ 44 నిర్ణీత  కక్ష్యలో ప్రవేశపెట్టింది.
* పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 46వ ప్రయోగం కావడం విశేషం. సాధారణంగా పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లను ఏర్పాటు చేస్తారు. కానీ దీనిలో మాత్రం శాస్త్రవేత్తలు రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లను మాత్రమే శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. 
* దేశంలోని విద్యార్థులందరికీ ఇస్రో తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని, వారు రూపొందించే ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుందని తెలిపారు.  భారత్‌ను వైజ్ఞానిక ఆవిష్కరణల దేశంగా మార్చేందుకు  కృషిచేయాలని   ఇస్రో డైరెక్టర్‌ శివన్‌  పిలుపునిచ్చారు.
ఇస్రో : 1969
PSLV: Polar Satellite Launch Vehicle ( The PSLV was first launched on 20 September 1993)
GSLV : Geosynchronous Satellite Launch Vehicle
ప్రస్తుత ఇస్రో డైరెక్టర్‌ :  శివన్‌

views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams