Current Affairs Telugu Daily

పశ్చిమ అంటార్కిటికాలో 2 కి.మీ. లోతైన బోరు బావి 
చరిత్రలోనే తొలిసారిగా మంచు ఖండం అంటార్కిటికాలో 2 కి.మీ.ల లోతైన బోరు బావిని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు విజయవంతంగా తవ్వారు.
  • గతంలో విఫలయత్నం చేసిన బ్రిటన్‌ అంటార్కిటిక్‌ సర్వే(బాస్‌) పరిశోధకులు చివరకుకు లక్ష్యాన్ని సాధించారు. 11 సభ్యుల బృందం అక్కడి అతిపెద్ద మంచు ఫలకం రట్‌ఫోర్డ్‌పై 12 వారాలు ఈ పనిని చేపట్టింది.
  • మైనస్‌ 30డిగ్రీ సెల్సియస్‌ శీతల స్థితిలో వారు రోజు తరబడి దీన్ని చేపట్టారు. 2019 జనవరి 8న ప్రారంభించిన తవ్వకం పనులను 63 గంటల పాటు కొనసాగించి, 2,152 మీటర్ల లోతులో అవక్షేపాలను తొలగించారు.
  • ఈ బావి గుంతలో పలు పరికరాలను చొప్పించి అక్కడి నీటి ఒత్తిడి, మంచు వాతావరణం, అది కరిగే పరిస్థితులను గమనిస్తున్నారు. 
  • బీమిష్‌గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టు ఇప్పటిది కాదు. 20 ఏళ్ల కిందటి నుంచే బాస్‌ ప్రణాళికలో ఉంది. 2004లో చేపట్టిన తవ్వకాలు ముందడుగు పడలేదు. దీంతో పరిశోధకులు సాంకేతిక అవరోధాలను అధిగమించి ఇప్పుడు విజయం సాధించారు. 

views: 688

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams