Current Affairs Telugu Daily

నజీర్‌ అహ్మద్‌ వానీకి అశోక్‌చక్ర 
ఉగ్రవాదుతో పోరాడుతూ అమరుడైన సైనికుడు లాన్స్‌నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సాహస పురస్కారం అశోక్‌చక్రను ప్రభుత్వం ప్రకటించింది.  
  • గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పతకాన్ని అందిస్తారు. ఆయన భార్య మహజబీన్‌ దీన్ని అందుకుంటారు. నజీర్‌ అహ్మద్‌ స్వస్థలం జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలోని చెకి అష్ముజీ పట్టణం.
  • ఉగ్రవాదానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2004లో ఆయన భారత సైన్యంలోని 162వ ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్‌ (ప్రాదేశిక సైన్యం) జమ్మూకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫ్యాంట్రీలో చేరారు.
  • దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై చేపట్టిన అనేక ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదులపై పోరులో చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఆయనకు రెండుసార్లు సేనా పతకం లభించింది.
  • 2018 నవంబర్‌ 25న షోపియాన్‌ జిల్లాలోని హిరాపుర్‌ గ్రామంలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో నజీర్‌ అహ్మద్‌ మృతి చెందారు. నాడు తూటాను ఖాతరు చేయకుండా లష్కరే తొయిబా ముఠాకు చెందిన జిల్లా కమాండర్‌ను, మరో విదేశీ ఉగ్రవాదిని ఆయన హతమార్చారు.
  • తూటాలు తగులుతున్నా లెక్కచేయకుండా ముందుకుసాగి మరో ఉగ్రవాదిని గాయపరిచారు. తీవ్రగాయాలతో చివరికి  కన్నుమూశారు. నజీర్‌ అహ్మద్‌ భార్య మహజబీన్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు.

views: 654

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams