Current Affairs Telugu Daily

ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ జైలు నుంచి విడుదల
లంచం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ ఓల్మెర్ట్‌(71) జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్‌ బోర్డు ఆయన శిక్ష పూర్తికాకుండానే 2017 జులై 2న విడుదల చేసింది. జెరూసలేం మేయర్‌గా, దేశ విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఓ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టును ప్రోత్సహించడానికి ఎహుద్‌ లంచం తీసుకున్నారని కేసు నమోదైంది. 2014లో న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2006లో ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఎన్నికైన ఎహుద్‌ పాస్తీనాతో శాంతిస్థాపనకు విశేషంగా కృషి చేశారు. ఓ దశలో జెరూసలేంలోని కొంత భాగాన్ని శాంతి ఒప్పందం ద్వారా వదులుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. జైలు నుంచి ముందస్తుగా విడుదలైన ఎహుద్‌ కొన్ని నెలల పాటు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది.
views: 1056



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams