Current Affairs Telugu Daily

సముద్రంలో కాలుష్యం తగ్గింపునకు ఎర్విస్‌ నౌక
సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు మహారాష్ట్రలోని పుణేకు చెందిన హజీక్‌ ఖాజీ(12) ఎర్విస్‌ పేరుతో నౌకను రూపొందించాడు.
  • సముద్ర జీవజాలంపై వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటోందో పలు డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకున్న ఖాజీ.. ఎలాగైనా సముద్ర జీవులను కాపాడాలని, అందుకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.  
  • సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కారకాల్లో ప్రధానమైనది ప్లాస్టిక్‌ అని తెలుసుకున్న ఖాజీ.. ఆ ప్లాస్టిక్‌ను నిర్మూలించేలా ఓ నౌకను డిజైన్‌ చేశాడు.
  • దానికి ఎర్విస్‌ అని పేరు పెట్టాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరుచేసి, శుద్ధ జలాలను సముద్రంలోకి తిరిగి పంపుతుంది.  
  • ఎర్విస్‌ నౌక కింది భాగంలో ఉండే మెషీన్‌ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి, దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది.  

views: 876

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams