Current Affairs Telugu Daily

గీతా గోపీనాథ్‌కు, ముగ్గురు తెలుగువారికి ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు
‘అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)’ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ను ప్రతిష్ఠాత్మక ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు వరించింది. 
*మొత్తం 28 మంది ప్రవాస భారతీయులు, రెండు సంస్థలకు ఈ ఏడాది ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారాలు దక్కాయి. వారిలో ముగ్గురు తెలుగువారు - పి.వి.సాంబశివరావు, గుణశేఖర్‌ ముప్పూరి, జగదీశ్వర్‌రావు మద్దుకూరి కూడా ఉన్నారు. మూడు రోజులుగా వారణాసిలో జరుగుతున్న 15వ ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ సదస్సు బుధవారం(Jan23)తో ముగిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముగింపు ఉపన్యాసం చేశారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులను అందజేశారు. 
*నార్వే ఎంపీ హిమాన్షు గులాటి, దక్షిణాఫ్రికా దౌత్యవేత్త అనిల్‌ సూక్లల్‌ తదితరులతోపాటు గయానా హిందూ ధార్మిక సభ, ఈజిప్టులోని భారతీయ కమ్యూనిటీ సంఘం ఈ అవార్డును అందుకున్నాయి. 
1. వైద్యం-వ్యాపార రంగంలో చేసిన కృషికిగాను గుణశేఖర్‌(జమైకా)కు అవార్డు దక్కింది. 
2. సాంకేతిక రంగంలో సేవలకు గుర్తింపుగా సాంబశివరావు(కెన్యా), 3.వ్యాపారరంగంలో జగదీశ్వర్‌ రావు(పోలండ్‌) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
*15వ ‘ప్రవాసీ భారతీయ దివస్‌’ సదస్సు వారణాసి లో జరిగింది.

views: 703

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams