Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వేళల్లో మార్పులు 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన కోర్టు మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తుంది.
  • 1:30 నుంచి 2:15 వరకు భోజన విరామం. 2:15కు తిరిగి ప్రారంభమై 4:15కు కోర్టు పనిగంటలు ముగియనున్నాయి.
  • ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) మానవేంద్రనాథ్‌రాయ్‌ 2019 జనవరి 22న ఉత్తర్వులిచ్చారు.
  • 2019 జనవరి 28 నుంచి ప్రకటించిన పనివేళలు అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు హైకోర్టు ఉదయం 10:15కే ప్రారంభమయ్యేది.

views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams