Current Affairs Telugu Daily

ప్రియమ్‌ తాటెడ్‌, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డికి బాల పురస్కార్‌ల ప్రదానం
విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు, బాలల సంక్షేమానికి పాటుపడుతున్న వ్యక్తులు/సంస్థలకు అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2019 అవార్డులను 2019 జనవరి 22న డిల్లీలో ప్రదానం చేశారు.
  • రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రియమ్‌ తాటెడ్‌(విశాఖపట్నం), డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి (విజయవాడ) ఈ అవార్డులను అందుకున్నారు.
  • బాలలకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించడం, వీధి బాలలు, లైంగిక వేధింపులకు గురైన బాలలకు ఆశ్రయం కల్పించడం, వారికి విద్యాబుద్ధులు అందిస్తున్నందుకు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డికి బాల కల్యాణ్‌ పురస్కార్‌ అవార్డు దక్కింది.
  • రోర్‌/ఫిగర్‌ స్కేటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరచి పదుల సంఖ్యలో పతకాలు సాధించిన ప్రియమ్‌ తాటెడ్‌కు క్రీడా విభాగంలో బాల శక్తి పురస్కార్‌ అవార్డు దక్కింది.

views: 942

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams