ఆంధ్రప్రదేశ్లో మృతిచెందిన న్యాయవాది కుటుంబానికి రూ.4 లక్షలు
న్యాయవాది మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తన వాటాగా(మ్యాచింగ్ గ్రాంట్) కింద రూ.4 లక్షలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే బార్ కౌన్సిల్ చెల్లిస్తున్న రూ.4 లక్షల మొత్తానికి ప్రభుత్వం చెల్లించనున్న రూ.4 లక్షలు అదనం. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి న్యాయశాఖ 2019 జనవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ న్యాయవాదులు సంక్షేమ నిధి చట్టం-1987 ప్రకారం... సభ్యత్వం ఉన్న న్యాయవాదుల మ ృతి చెందిన సందర్భంలో వారిపై ఆధారపడి జీవించే వారికి, కుటుంబ సభ్యులకు రూ.4 లక్షలు ఇవ్వాలని న్యాయవాదులు మండలి 2018లో నిర్ణయం తీసుకుంది.
మ్యాచింగ్ గ్రాంట్ కింద కొంత సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.4 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది.
మృతి చెందిన న్యాయవాది తరపువారు 6 నెలల్లో న్యాయవాదుల మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఆ అభ్యర్థనను 5 నెలల్లో న్యాయవాదుల సంక్షేమ కమిటీ పరిష్కరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.