Current Affairs Telugu Daily

పాల్వంచ స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ పునఃప్రారంభం
తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పాల్వంచలోని స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారం దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత పున: ప్రారంభమయింది.
  • నష్టాలు వస్తున్నాయంటూ 2016 అక్టోబరులో యాజమాన్యం ఈ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపి వేసింది. ఇక్కడ మొత్తం రెండు యూనిట్లు ఉన్నాయి.
  • 2019 జనవరి 22న ఎన్‌ఎండీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీఎస్‌ చెరియన్‌ రోజుకి 100 టన్నుల స్పాంజ్‌ ఐరన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న తొలి యూనిట్‌ను ప్రారంభించారు.    
  • పాల్వంచ స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారానికి 4 దశాబ్దాల చరిత్ర ఉంది. తొలి రెండు దశాబ్దాల్లో ఒక వెలుగు వెలిగిన కర్మాగారం ఎన్నో లాభాలు గడించింది.
  • ఆ తర్వాత సంక్షోభాల్లో చిక్కుకుంది. 2010 జులై 1న ఎన్‌ఎండీసీలో విలీనం అయింది. 2016లో మూతపడింది.

views: 791

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams