చైనా ‘లాంగ్ మార్చ్-5 వై2’ రాకెట్ ప్రయోగం విఫలం
రోదసిలోకి భారీ బరువును మోసుకెళ్లేందుకు చైనా 2017 జులై 2న ప్రయోగించిన ‘లాంగ్ మార్చ్-5 వై2’ రాకెట్ విఫలమైంది. ఓ భారీ ఉపగ్రహాన్ని ఇది కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. దక్షిణ హైనాన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ప్రయోగం విజయవంతమైనట్లు మొదట టీవీల్లో వార్తలు వచ్చాయి. అయితే కక్ష్యలోకి షిజియాన్-18 ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్-5 ప్రవేశపెట్టలేకపోయిందని చైనా ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. ఇప్పటివరకూ చైనా ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత భారీ ఉపగ్రహం షిజియాన్-18.
views: 1100