Current Affairs Telugu Daily

విదేశాలకు సాయంలో భారత్‌కు అగ్రస్థానం
విదేశాలకు సాయం చేయడంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సందర్భంగా 2019 జనదరి 20న విడుదల చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. అంతర్జాతీయంగా సాయం అందించడానికి 95 శాతం భారతీయులు సమ్మతిస్తున్నారు.
  • 94 శాతంతో తరువాత స్థానాల్లో ఇండోనేసియా, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అగ్రరాజ్యాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికాల్లో ఈ సమ్మతి 60కన్నా తక్కువ శాతం ఉంది. 
  • వలసలపై ఉత్తర అమెరికావాసులు సానుకూలత వ్యక్తం చేయగా, ఐరోపావాసులు వ్యతిరేకించారు. తమ దేశానికి కొత్తగా వస వచ్చే వారి వల్ల మేలు కలుగుతుందని 63 శాతం మంది అమెరికావాసులు అభిప్రాయపడుతున్నారు.
  • ప్రజాకర్షక విధానాల కన్నా, పారదర్శకతతో అమలు చేసే విధానాలే మంచివని ప్రపంచంలోని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని దేశాలు రక్షణాత్మక విధానాలను అనుసరిస్తుండడం, వాణిజ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అభిప్రాయనికి ప్రాధాన్యం ఏర్పడింది.
  • దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, వలసలపై స్వేచ్ఛాయత విధానాలు అనుసరించాలని కోరుతున్నారు. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న విధానం మంచిది కాదని చెబుతున్నారు. జీవితంలో ఉన్నతస్థానాలకు వెళ్లడానికి తగిన అవకాశాలు లేవని, ఇందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు.

views: 715Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams