Current Affairs Telugu Daily

నేపాల్‌లో  ఇండియా పెద్ద నోట్లు రద్దు
రూ.100కు మించిన విలువ ఉన్న భారత కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్‌ తమ దేశంలో నిషేధించింది. ఈ మేరకు నేపాల్‌ సెంట్రల్‌ బ్యాంకు ఒక ప్రకటన చేసింది.
  • రూ.2000, రూ.500, రూ.200 భారతీయ కరెన్సీని ఇక నేపాల్‌లో అంగీకరించరు. ఈ కరెన్సీ నోట్లతో ఎలాంటి లావాదేవీలను జరపరాదు.
  • రూ.వంద, అంతకంటే తక్కువ విలువ ఉన్న భారతీయ కరెన్సీతో మాత్రమే వ్యాపారలావాదేవీలు, మార్పిడికి నేపాల్‌లో ఇకపై అనుమతిస్తారు.
  • ఈ చర్య వల్ల నేపాల్‌ వెళ్లే భారతీయ పర్యాటకులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.  కొత్త నిబంధన ప్రకారం నేపాలీ పౌరులు భారత్‌ మినహా ఏ ఇతర దేశాలకూ రూ.2000, రూ.500, రూ.200నోట్లను తీసుకెళ్లడానికి వీలు లేదు.

views: 729Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams