Current Affairs Telugu Daily

క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ఫిలిప్‌కు తప్పిన ప్రమాదం
బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌(97) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
  • తూర్పు ఇంగ్లండ్‌లోని సాండ్రిన్‌గామ్‌ వద్ద ఫిలిప్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రిన్స్‌ ఫిలిప్‌నకు ఎటువంటి గాయాలు కాలేదని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రకటన విడుదల చేసింది. 
  • క్వీన్‌ ఎలిజబెత్‌, మాజీ నేవీ అధికారి ప్రిన్స్‌ ఫిలిప్‌ వివాహం 1947లో జరిగింది. డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ఫిలిప్‌ 2017లో అధికారిక రాజ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.
  • 2018లో జరిగిన మేజర్‌ సర్జరీ(హిప్‌ రీప్లేస్‌మెంట్‌) తర్వాత కూడా రాజ కుటుంబం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు.
  • డ్రైవింగ్‌ను ఎంతగానో ఇష్టపడే ప్రిన్స్‌ ఫిలిప్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ ఒబామా బ్రిటన్‌ పర్యటనకు వచ్చిన సమయంలో స్వయంగా కారు నడుపుతూ వారిని ంచ్‌కు తీసుకువెళ్లారు.
  • బ్రిటన్‌ నిబంధన ప్రకారం డ్రైవింగ్‌కు పరిమిత వయస్సు ఏమీ ఉండదు గానీ, 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ప్రతీ 3 సం॥లకు ఒకసారి లైసెన్స్‌ను రెన్యువల్‌ చేసుకోవాలి

views: 891



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams