Current Affairs Telugu Daily

జీవ ఇంధనంతో ఎగిరిన ఎతిహాద్‌ విమానం
యూఏఈలో తయారైన జీవ ఇంధనంతో తొలిసారిగా ఓ వాణిజ్య విమానం గాల్లోకి ఎగిరింది. అబుదాబి నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌ వరకూ 7 గంటల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
  • ఎతిహాద్‌ విమానయాన సంస్థ దీన్ని నడిపింది. బోయింగ్‌ 787 రకానికి చెందిన ఈ విమానంలో జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ తయారు చేసిన కొత్త తరం 1బి ఇంజిన్లు ఉన్నాయి.
  • ఎడారిలో ఉప్పునీటితో పెంచిన మొక్క నుంచి ఈ జీవ ఇంధనం తయారు  చేశారు. ఈ ఇంధన వినియోగంతో కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.
  • యూఏఈలోని ఖలీఫా వర్సిటీలోని మస్దార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన సుస్థిర జీవ ఇంధన పరిశోధక సంస్థ(ఎస్‌బీఆర్‌సీ) దీన్ని ఉత్పత్తి చేసింది.
  • సాలికోర్నియా మొక్క నుంచి తీసిన నూనెను జెట్‌ ఇంధనంగా మార్చింది. మస్దార్‌ నగరంలో రెండు హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యేకమైన ఫామ్‌ ఏర్పాటు చేసి వీటిని పెంచారు.
  • ఉప్పునీటితోనే మొక్కకు కావాల్సిన పోషకాలను అందించేందుకు అందులో చేపలు, రొయ్యల పెంపకం కూడా చేపట్టారు.

views: 824

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams