Current Affairs Telugu Daily

ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంపు
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 50% మేర పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.12వేలు తగ్గకుండా వేతనం ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్ణింపచేయనున్నారు.
అదే సమయంలో వేతనాల పెంపు వర్తింపునకు ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. మంజూరైన రెగ్యులర్ ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆర్థిక శాఖ అనుమతితో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే పెంపుదల వర్తింప చేస్తారు, ఎలాంటి అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉండవని పేర్కొన్నారు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కన్సల్టెంట్లకు, సలహాదారులకు, ఔట్  సోర్సింగ్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొన్నారు.

views: 1317

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams