Current Affairs Telugu Daily

సుప్రీం కోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులు
సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు గా జస్టిస్‌ దినేష్‌ మాహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ప్రమాణ స్వీకారం
సర్వోన్నత న్యాయస్థానంలోని ఒకటో నంబరు కోర్టులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
దీంతో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి.
ఇంతవరకు జస్టిస్‌ మాహేశ్వరి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 
సీనియర్లయిన రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజోగ్‌, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌లు కాదని జస్టిస్‌ ఖన్నాకు పదోన్నతి కల్పించడంపై విమర్శలు వచ్చాయి.

views: 712



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams