Current Affairs Telugu Daily

మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లకు సుప్రీంకోర్టు అనుమతి
మహారాష్ట్రలో షరతుతో డ్యాన్స్‌ బార్ల నిర్వహణకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు 2019 జనవరి 17న తీర్పునిచ్చింది.
  • డ్యాన్స్‌ బార్లకు వ్యతిరేకంగా 2016లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేసింది. నియంత్రణలు ఉండటం సబబే కానీ పూర్తి నిషేధం మాత్రం సరికాదని పేర్కొంది. జస్టిస్‌ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది
  • మహారాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌ రూముల్లో అసభ్య నృత్యాల నిషేధం, మహిళ గౌరవ రక్షణ చట్టం పేరుతో 2016లో కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది.
  • ఈ చట్టాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్‌ బార్లను నిషేధించే తరహాలో చట్టాన్ని తీసుకొచ్చిందని వారు నివేదించారు.
  • రాష్ట్ర ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంది. డ్యాన్స్‌ బార్లలో న ృత్యాలు మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉంటున్నాయని తాము గుర్తించినట్లు తెలిపింది.
  • ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు డ్యాన్స్‌ బార్ల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
తీర్పులోని అంశాలు 
  • డ్యాన్స్‌ బార్లలో ప్రదర్శనలు ఇచ్చేవారికి టిప్‌లు ఇవ్వొచ్చు. కానీ వారిపై కరెన్సీ నోట్లు చెల్లకూడదు. 
  • సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకే ఈ బార్లు పనిచేయాలని 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఉంది. ఆ నిబంధనను పాటించాల్సిందే. 
  • డ్యాన్స్‌ బార్లలో సీసీటీవీ కెమెరా ఏర్పాటు తప్పనిసరి అని కూడా చట్టంలో ఉంది. గోప్యతకు భంగం కలిగించేలా ఉందంటూ ఈ నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
  • మతపరమైన స్థలాలు, విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో డ్యాన్స్‌ బార్లను ఏర్పాటుచేయాలంటూ ఉన్న నిబంధనను తొలగించింది. 
  • బార్‌ గదులు, నృత్య వేదిక మధ్య పార్టిషన్‌ ఉండాలన్న నిబంధనను కొట్టివేసింది.

views: 828

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams