Current Affairs Telugu Daily

ముగ్గురు ఇండో-అమెరికన్లకు కీలక పదవులు 
ముగ్గురు భారత సంతతి అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అత్యంత ప్రాధాన్యమైన మూడు విభాగాలకు 2019 జనవరి 16న వీరిని అధ్యక్షుడు ట్రంప్‌ ఎంపిక చేశారు.
  • తాజా నియామకాలతో ట్రంప్‌ ఇప్పటివరకూ 36 మందికిపైగా భారతీయ అమెరికన్లకు ముఖ్యమైన పదవులు ఇచ్చినట్టయింది. అణు విద్యుత్‌ విభాగ సహాయ కార్యదర్శిగా రీటా బరన్వాల్‌,  ప్రైవసీ-సివిల్‌ లిబర్టీస్‌ ఓవర్‌సైట్‌ బోర్డు సభ్యుడిగా ఆదిత్య బంజాయ్‌, కోశాగార సహాయ కార్యదర్శిగా బిమల్‌ పటేల్‌ను అధ్యక్షుడు ఎంపిక చేశారు.
  • అణుశక్తి నిపుణురాలైన బరన్వాల్‌ ఇప్పటికే న్యూక్లియర్‌ ఆవిష్కరణ విభాగం గెయిన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
  • ఈ నియామకంతో అణు సాంకేతిక పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ, వసతుల కల్పనకు సంబంధించిన బాధ్యతలను ఆమె నిర్వర్తించాల్సి ఉంటుంది. యేల్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్‌ అయిన బంజాయ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి.
  • రచయితగా, అధ్యాపకుడిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సహాయకుడిగా, అమెరికా న్యాయశాఖలో సహాదారులుగా పనిచేశారు. బిమల్‌ పటేల్‌ ఆర్థిక నిపుణులు.
  • ప్రస్తుతం ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఓవర్‌సైట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఎస్‌వోసీ) కోశాగార సహాయ కార్యదర్శిగా ఉన్నారు. గతంలోనూ ఆయన పలు ప్రభుత్వ పదవులు చేపట్టారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యుడిగానూ సేవలందించారు.

views: 785



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams