కేంద్ర ఆరోగ్య శాఖ మరో 80 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(FDC) ఔషధాల్ని నిషేధించింది. ఇందులో నొప్పి నివారిణులు, యాంటిబయోటిక్‌తో పాటు బీపీ, బ్యాక్టీరియా, ఫంగస్‌తో వ్యాపించే వ్యాధుల చికిత్సకు వాడే మందులున్నాయి.
ఈ ఔషధాలపై నిషేధం 2019 జనవరి 11 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిషేధానికి గురైన మొత్తం ఎఫ్డీసీ ఔషధాల సంఖ్య 405కు పెరిగింది. 2018 సెప్టెంబర్‌లో 325 ఔషధాలను నిషేధిత జాబితాలో చేర్చారు.