Current Affairs Telugu Daily

వాట్సాప్‌లో విచారణతో విడాకులు మంజూరు చేసిన నాగ్‌పుర్‌ కుటుంబ న్యాయస్థానం
వాట్సాప్‌ వీడియో కాల్‌ సాయంతో అమెరికాలో ఉన్న భార్య, భారత్‌లో ఉన్న భర్త విడాకులు పొందారు. ఈ అరుదైన సంఘటనకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కుటుంబ న్యాయస్థానం వేదికైంది.
  • 2013 ఆగస్టు 11న నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి (37), హైదరాబాద్‌ (సికింద్రాబాద్‌)కు చెందిన యువతి (35) పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన ఇద్దరూ అమెరికాకు చెందిన ఆటో మొబైల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.
  • వీసా గడువు ముగియడంతో కొంతకాలం ఆమె నాగ్‌పుర్‌లో నివాసం ఉంది. ఈ సమయంలో ఇరువురి మధ్య మనస్పర్థలు మొదయ్యాయి. తర్వాత ఆమె విద్యార్థి వీసా మీద మిషిగన్‌ వెల్లినా వారిమధ్య సఖ్యత కుదరకపోగా, మరింత దూరం పెరుగుతూ వచ్చింది.
  • అమెరికా నుంచి తిరిగొచ్చిన భర్త నాగ్‌పుర్‌ కుటుంబ న్యాయస్థానంలో భార్య నుంచి విడాకులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనకు అనుగుణంగా ఈ కేసును కౌన్సిల్‌కు అప్పగించారు. కేసు విచారణకు స్వయంగా తను హాజరుకాలేనని భార్య వెల్లడించడంతో న్యాయస్థానం సామాజిక మాధ్యమం వాట్సాప్‌ను సరికొత్త విధానానికి అనుసరించింది.
  • యువతి విజ్ఞప్తి మేరకు కౌన్సిల్‌ ఆమెను వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా ప్రశ్నించి, ఆ కాల్‌ను రికార్డు చేశారు. తర్వాత భర్తను ప్రశ్నించగా ఇద్దరూ విడాకులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. భార్య తరఫున ఆమె సోదరుడు కోర్టుకు రాగా.. భర్త మాత్రం విచారణ సమయంలో స్వయంగా హాజరయ్యాడు.

views: 699

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams