ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన రెండో శాసనసభ తొలి సమావేశాలు 2019 జనవరి 17న ప్రారంభమయ్యాయి.
ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మొత్తం 114 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయించారు.
తెలంగాణ తొలి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన 76 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు.
23 మంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు.
సభలో అత్యంత సీనియర్ సభ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకూ ఆయన ఉపఎన్నికతో పాటు 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఉన్నారు.
ఉప ఎన్నికలతో కలిపి హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (73) ఈ సభలో ఎక్కువ వయసున్న సభ్యుడు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ (33) పిన్న వయస్కురాలు
తెలంగాణ శాసనసభలో మొత్తం 119 స్థానాలకుగాను 88 మంది టీఆర్ఎస్ సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 19, మజ్లిస్‌కు 7, టీడీపీకి ఇద్దరు, బీజేపీ తరఫున ఒక సభ్యుడు ఉన్నారు. ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు గెలిచారు.
కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు గతంలో వేర్వేరు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. మేడ్చల్ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు.
మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించి, తెలంగాణ తొలి శాసనసభలో లేని 16 మంది ఈసారి మళ్లీ ఎన్నికయ్యారు
మొదటి శాసనసభకు నామినేట్ అయిన స్టీఫెన్సన్ 2వ శాసనసభకు కూడా నామినేట్ అయ్యారు.