Current Affairs Telugu Daily

కృత్రిమ మేధస్సు సాంకేతికతపై శిక్షణనిచ్చేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా 

కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతపై దేశ యువతకు పెద్ద ఎత్తున శిక్షణనిచ్చేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇండియా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పది విశ్వవిద్యాలయాల్లో ఏఐ పరిశోధనశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
వచ్చే మూడేళ్లలో పది వేల మంది డెవలపర్లకు నైపుణ్యాలు కల్పించాలని, 5 లక్షల మంది యువతీయువకులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. భారత్‌ ఆర్థిక, సామాజిక పురోగతి కోసం ఏఐని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా తాము సాధిస్తోన్న ప్రగతిని బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో వివరిస్తూ ఈ విషయాలను ప్రకటించింది. ప్రతి సంస్థకూ, వ్యక్తికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విద్యాసంస్థలు, పౌర సమాజంలోని వివిధ వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ‘ఇంటెలిజెంట్‌ క్లౌడ్‌ హబ్‌ ప్రోగ్రామ్‌’ను కూడా ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.
ఏఐ, డేటా సైన్సెస్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అంశాల్లో పరిశోధక సంస్థలు, ఉన్నత విద్యాసంస్థల్లో శిక్షణకు ఈ  ప్రొగ్రామ్‌ ద్వారా సంస్థ చేయూతను ఇవ్వనుంది.

ఏఐతో మైక్రోసాఫ్ట్‌ చూపిన కొన్ని పరిష్కారాలు 

* గుండె జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏఐ పరిష్కారాన్ని అపోలో ఆసుపత్రులతో కలిసి అభివృద్ధి చేసింది. 
* కచ్చితమైన వ్యాధి నిర్ధారణకు, క్యాన్సర్‌ వంటి రోగాలను మందుగా గుర్తించేందుకు సాంకేతికతను ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌తో కలిసి రూపొందించింది. 
* సందేశాల ద్వారా సంభాషణలు జరుపుతూ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు, వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడే ‘రెవా’ అనే ‘చాట్‌బోట్‌’ను ఫ్యూచర్‌ జనరలి బీమా సంస్థకు అందించింది. 
* ప్రముఖ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేకు చెందిన స్పెక్టాకామ్‌ సంస్థ, స్టార్‌ ఇండియాలతో కలిసి క్రికెట్‌ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సాయపడే పవర్‌ బ్యాట్‌ను తయారు చేసింది.

  • అనంత్‌ మహేశ్వరి  మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌

views: 887

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams