Current Affairs Telugu Daily

ఆదాయపు పన్ను వ్యవహారాలపై  సరికొత్త పోర్టల్‌ 2.0కు రూపకల్పన 

ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌, సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను కలిపి కొత్తగా సమీకృత ఈ-ఫైలింగ్‌, ప్రాసెసింగ్‌ సెంటర్‌ 2.0ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ రిటర్నుల పరిశీలన, ఇతర వ్యవహారాలకు 63 రోజుల మేర సమయం పడుతోందని, ఈ కొత్త సెంటర్‌వల్ల అది ఒక్క రోజుకు తగ్గిపోతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు కోసం 4,241 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. అందరికంటే తక్కువకు బిడ్డింగ్‌ వేసిన ఇన్ఫోసిస్‌ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త వ్యవస్థ అందుబాటులో రావడానికి 21 నెలల సమయం పడుతుందని తెలిపారు. 


views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams