Current Affairs Telugu Daily

హాంకాంగ్‌, చైనా విలీనానికి 20 సం॥లు
బ్రిటన్‌ హాంకాంగ్‌ను చైనాకు అప్పగించి 20 సం॥లు అయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ హాంకాంగ్‌లో పర్యటించారు. 2017 జూన్‌ 29 నుంచి జులై 1 వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 2013లో జీ జిన్‌పింగ్‌ చైనా దేశాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత హాంకాంగ్‌ రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా కేరీ లామ్‌ హాంకాంగ్‌ నూతన నేతగా బాధ్యతలు స్వీకరించారు. 
` మొదటి నల్లమందు యుద్ధం (1839-42) తర్వాత హాంకాంగ్‌ బ్రిటన్‌ చేతుల్లోకి వెళ్లింది. 
` 1898లో 99 సంవత్సరాల లీజును బ్రిటన్‌ దక్కించుకుంది.
` 2వ ప్రపంచయుద్ధం జరిగే రోజుల్లో జపాన్‌ హాంకాంగ్‌ను ఆక్రమించుకుంది. 
` 1945లో యుద్ధం ముగియడంతో హాంకాంగ్‌ తిరిగి బ్రిటన్‌ వశమైంది. 
` హాంకాంగ్‌పై 1980లో బ్రిటన్‌, చైనాల మధ్య ఒప్పందం ఖరారైంది. 
` దాని ప్రకారం 1997లో హాంకాంగ్‌పై సార్వభౌమాధికారాలను బ్రిటన్‌ చైనాకు అప్పగించింది. 
` ప్రత్యేక రాజకీయ వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానంతో ఒక దేశం..రెండు వ్యవస్థలు అనే ప్రత్యేక విశిష్టత హాంకాంగ్‌ కలిగివుంది.

views: 1164



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams