Current Affairs Telugu Daily

గ్లోబల్‌ థింకర్స్‌-2019 జాబితాలో ముకేశ్‌ అంబానీకి చోటు 
గ్లోబల్‌ థింకర్స్‌-2019 జాబితాలో ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఫారిన్‌ పాలసీ మొత్తం 100 మందితో ఈ జాబితా రూపొందించింది. ప్రస్తుతానికి కొంత మంది పేర్లనే వెల్లడించింది.
  • పూర్తి జాబితాను 2019 జనవరి 22న విడుదల చేస్తుంది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టీన్‌ గార్డే కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
  • గ్లోబల్‌ థింకర్స్‌(అంతర్జాతీయ ఆలోచనాపరులు) జాబితాకు ఈ ఏడాది పదో వార్షికోత్సవం సందర్భంగా ఫారిన్‌ పాలసీ తన జాబితాలను 10 విభాగాలుగా చేసి.. ఒక్కో విభాగంలో 10 మంది పేర్లు ఇవ్వాలని నిర్ణయించింది.
  • గత దశాబ్ద కాలంలో ప్రపంచంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వారితో తొలి గ్రూపు పేర్లు ఇవ్వనుంది.
  • 2018లో ప్రభావాన్ని చూపిన వ్యక్తుతో ఇతర గ్రూపును నింపింది. అందులో భాగంగా 40 ఏళ్లలోపు ఆలోచనాపరులు, రక్షణ, భద్రతా రంగాలు, విద్యుత్‌-వాతావరణం, సాంకేతికత, ఆర్థిక శాస్త్రం-వ్యాపారం, విజ్ఞానం-ఆరోగ్యం, కార్యకలాపాలు, కళలు.. ఇలా విభజిస్తూ వెళ్లింది.
  • సాంకేతిక ఆలోచనాపరుల జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
  • గత దశాబ్ద కాలంలో ప్రభావాన్ని చూపిన వ్యక్తుల జాబితాలో జాక్‌మా, క్రిస్టీన్‌ లగార్డులు చోటు చేసుకున్నారు. యూరోపియన్‌ కమిషనర్‌ ఫర్‌ కాంపిటిషన్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌, టీవీ వ్యాఖ్యాత ఫరీద్‌ జకారియా, బిల్‌-మిలిందా గేట్స్‌, అమెజాన్‌ బెజోస్‌ ఇందులో చోటు దక్కించుకున్నారు.
న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆడెర్న్‌ 40 ఏళ్ల లోపు ఆలోచనాపరుల జాబితాలో ఉన్నారు.

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams