Current Affairs Telugu Daily

సిక్కింలో ‘ఒక కుటుంబం`ఒక ఉద్యోగం పథకం’ ప్రారంభం
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం`ఒక ఉద్యోగం పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి పవన్‌ ఛామ్లింగ్‌ 2019 జనవరి 13న రాజధాని గ్యాంగ్‌టక్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.
  • రాష్ట్రంలో కుటుంబానికి ఒకరు చొప్పున 12 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. 2018 శీతాకాల సమావేశాల్లో సిక్కిం ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అందజేసేలా సిక్కిం సర్కారు చర్యలు తీసుకుంది.
  • ఈ పథకం అమలుతో సిక్కిం సరికొత్త పథకాన్ని అమలు చేసి చూపించింది. 

views: 878

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams