Current Affairs Telugu Daily

లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం
పర్వతాలు, సరస్సులు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్‌ కర్మాగారం ఏర్పాటు కానుంది. 25 వేల ఎకరాల్లో 5000 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు.
  • ఒకే ప్రాంతంలో ఇంత భారీ విస్తీర్ణంలో ఇప్పటివరకూ ఏ సౌర విద్యుత్‌ కర్మాగారామూ ఏర్పాటు కాలేదు.
  • జమ్మూకశ్మీర్‌లోనే ఉన్న కార్గిల్‌లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొకదాన్ని నిర్మించనున్నారు. ఈ రెండు కర్మాగారాల ద్వారా ఏటా 12,750 టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అవకాశం ఉంది.
  • కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నేతృత్వంలోని భారత సౌర విద్యుత్‌ సంస్థ (SECI) ఈ కర్మాగారాలను నెలకొల్పడానికి కృషి చేస్తోంది. రూ.45 వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా వీటిని నిర్మించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
  • లద్దాఖ్‌లోని హన్లె ఖాల్డో, కార్గిల్‌లోని సురుల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
  • లద్దాఖ్‌లో ఉత్పత్తైన విద్యుత్‌ను హర్యానాలోని కైథల్‌కు సరఫరా చేస్తారు. ఇందుకోసం లెహ్-మనాలీ మార్గం వెంబడి 900 కి.మీ. మేర లైన్‌ వేయనున్నారు. కార్గిల్‌ ప్రాజెక్టును శ్రీనగర్‌కు సమీపంలోని న్యూ వాన్‌పోలో ఉన్న గ్రిడ్‌తో అనుసంధానిస్తారు.
SECI-Solar Energy Corporation of India

views: 690

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams