Current Affairs Telugu Daily

విద్య, ఉద్యోగాల్లో  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం 
జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం సంతరించుకొంది. దీనిపై 2019 జనవరి 12న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టంగా మారింది.
  • 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ అంశం రాష్ట్రపతి ఆమోదముద్రతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం సంతరించుకొంది.
  • రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరించాల్సి వచ్చింది.
  • ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారుచేస్తూ ఆ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నుంచి ఇది కార్యరూపంలోకి వస్తుంది.
  • రూ.8 లక్షల వరకు వార్షికాదాయం, 5 ఎకరాల్లోపు భూమి, 1000 చదరపు అడుగు విస్తీర్ణంలోపు ఇల్లు, నోటిఫై చేసిన ప్రాంతాల్లో 100 చదరపు గజాల్లోపు, నోటిఫై చేయని ప్రాంతాల్లో 200 గజాల్లోపు స్థలం ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ కోటా ఉపయోగించుకోవడానికి అర్హత పొందాయి.
  • విధివిధానాలను అధికారికంగా ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది.

views: 681

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams