Current Affairs Telugu Daily

కాకతీయ బ్రాండ్‌తో మామిడి ఎగుమతికి తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయం 
రాష్ట్రంలో పండుతున్న మామిడి కాయలను ‘కాకతీయ’ బ్రాండ్‌ పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. కార్బైడ్‌ వాడకుండా శాస్త్రీయంగా ఇథిలిన్‌ వాయువుతోనే మామిడికాయలను మాగబెట్టి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్రిటన్‌, కొరియా, జపాన్‌, అరబ్‌ దేశాలకు ఎగుమతి చేయాలనేది యోచన.
  • కాయలను మాగబెట్టి విదేశాలకు పంపేందుకు అనువుగా ఉండేలా రాజేంద్రనగర్‌లోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్యాక్‌హౌస్‌ సిద్ధమవుతోంది. దీనిని మామిడి పండ్ల ఎగుమతులకు వినియోగించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ శాఖ ధ్రువీకరించి ఎగుమతి చేసేవాటికి కాకతీయ బ్రాండ్‌ వినియోగిస్తారు. 

views: 634

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams