Current Affairs Telugu Daily

భారత మానవ సహిత గగన్‌యాన్ యాత్రికులలో ఒక మహిళ 2021 డిసెంబర్ నాటికి పంపాలని నిర్ణయం
భారత మానవ సహిత గగన్‌యాన్ యాత్రికులలో ఒక మహిళ 2021 డిసెంబర్ నాటికి పంపాలని నిర్ణయం : ఇస్రో శివన్ బెంగళూరు
భారతదేశ పు తొట్టతొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్‌కు రంగం సిద్ధం అయింది. 2021 డిసెంబర్ నాటికి గగన్‌యాన్ ప్రయోగం చేపట్టాలని తలపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను ఇస్రో ఛైర్మన్ కె శివన్ శుక్రవా రం ఇక్కడ విలేకరులకు తెలిపారు. మానవులను అంతరిక్షంలోకి పంపించే ఈ ప్రయోగం భారత్‌కు తొలి ప్రయత్నం.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత విశిష్టరీతిలో తలపెట్టిన గగన్‌యాన్ 2021 మిషన్‌లో భాగంగా మహిళా వ్యోమగామిని కూడా అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లు శివన్ చెప్పారు.
మొత్తం ముగ్గురు సభ్యుల వ్యోమగాముల బృందంతో గగన్‌యాన్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్ర లక్షం సరైన రీతిలో సఫలం అయ్యేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు శివన్ వివరించారు. ప్రస్తుతానికి అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదికి గగన్‌యాన్ అత్యంత ప్రాధాన్యతక్రమపు కార్యక్రమం. గత ఏడాది స్వాతంత్య్రదినోత్సవం ప్రసంగంలో ప్రధాని మోడీ భారతదేశపు విశిష్ట అంతరిక్ష ప్రయోగంగా గగన్‌యాన్ నిలుస్తుందని, దీనిని త్వరలోనే ఇస్రో శాస్త్రజ్ఞులు చేపడుతారని తెలిపారు.
దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఇస్రో గగన్‌యాన్‌కు 2021 డిసెంబర్‌ను సమయంగా ఖరారు చేసింది. ఇక మానవ రహిత అంతరిక్ష యాత్రకు కూడా ఇస్రో తొలిసారి సిద్ధం అయిం ది. ఇందులో తొలి ప్రయోగం 2020 డిసెంబర్‌లో రెండవది 2021లో ఉంటుందని శివన్ చెప్పారు. దీని తరువాత మానవులను అంతరిక్షంలోకి పంపించే కార్యక్రమం ఉంటుంది. తమ ఇస్రో బృందం అంతా అన్ని ప్రయోగాల విజయవంతానికి సర్వంసన్నద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఇస్రో గగన్‌యాన్, మానవరహిత యాత్రలకు రూ 9023 కోట్ల రూపాయల కేటాయింపులకు ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ గుర్తు చేశారు. గత ఏడాది విజయాలు, కొత్త ఏడాది లక్షాలను ఇస్రో ప్రధాన కార్యాలయంలో సంస్థ అధినేత అన్ని కోణాలలో వివరించారు.
  • Headquarters: Bengaluru
  • Founder: Vikram Sarabhai
  • Founded: 15 August 1969
  • Director: Kailasavadivoo Sivan

views: 842



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams