Current Affairs Telugu Daily

7 ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు అధిరోహించిన కర్నల్‌ రణ్‌వీర్‌ జామ్‌వాల్‌
ప్రపంచంలోని 7 ఖండాల్లో గల అత్యంత ఎత్తైన శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ సైనికాధికారిగా కర్నల్‌ రణ్‌వీర్‌ జామ్‌వాల్‌ రికార్డు సృష్టించారు.
  • 2019 జనవరి 4న భారత జాతీయ పతాకాన్ని అంటార్కిటికాలోని మౌంట్‌ విన్సన్‌పై ఎగుర వేశారు. జనవరి 1న కొండను అధిరోహించడానికి తొమ్మిది మందితో కూడిన బృందం ప్రయత్నించగా, ఉష్ణోగ్రత మైనస్‌ 37డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ముగ్గురు మధ్యలోనే విరమించుకున్నారు.
  • రణ్‌వీర్‌ సహా ఆరుగురు మాత్రమే శిఖరాన్ని అధిరోహించగలిగారు. ఆయన ఇంతకుముందే ప్రపంచం(ఆసియా)లోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌, ఆఫ్రికాలో కిలిమంజారో, ఆస్ట్రేలియాలో కార్‌స్టెంజ్‌ పిరమిడ్‌, ఐరోపాలో ఎల్‌బ్రస్‌, దక్షిణ అమెరికాలో అకాన్కాగో, ఉత్తర అమెరికాలో డినాలి పర్వతాలను అధిరోహించారు. ఇప్పటి వరకు 6 ఖండాల్లో 30 సాహసయాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు.
  •  మూడు వేర్వేరు పర్వతారోహకుల బృందాలకు మార్గదర్శకత్వం వహించి, 51 మందిని ఎవరెస్టును అధిరోహించడంలో తోడ్పడిన మొదటి భారతీయుడిగా కూడా ఇంతకుముందు చరిత్ర సృష్టించారు. 
  •  2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం సందర్భంగా ఎవరెస్టు శిఖరంపై చిక్కుకుపోయిన 60మంది పర్వతారోహకులను క్షేమంగా ప్రాణాలతో రక్షించగలిగారు. 
  •  మనదేశంలోనే అత్యున్నత సాహస అవార్డు ‘‘టెంజింగ్‌ నార్గే జాతీయ సాహస అవార్డు’’ను పొందారు. ఇది అర్జున అవార్డుతో సమానం. దీంతోపాటు పలు అవార్డులు వచ్చాయి.

views: 766



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams