Current Affairs Telugu Daily

జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్‌ అవార్డు
జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) కు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) అవార్డు లభించింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ), 2018 సీఎస్‌ఆర్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్‌ సంస్థగా అవార్డు దక్కించుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ తెలియజేసింది.
ఇండియా ప్రొఫెషనల్స్‌ ఫోరమ్‌- యూకే అధ్యక్షుడు డాక్టర్‌ మోహన్‌ కౌల్‌, సెబీ మాజీ ఛైర్మన్‌ జీఎన్‌ బాజ్‌పాయ్‌ చేతుల మీదగా జీహెచ్‌ఐఏఎల్‌ సీఎఫ్‌ఓ రాజేష్‌ అరోరా ఈ అవార్డు అందుకున్నారు. సమాజసంక్షేమానికి చేయూత అందించటానికి తాము ఎప్పుడూ ముందుంటామని జీహెచ్‌ఐఏఎల్‌ సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌ పేర్కొన్నారు.

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams