Current Affairs Telugu Daily

ఇంగ్లిష్‌ ఛానెల్‌లో సీఫ్రాంటియర్‌, హ్యుయాన్‌ ఎండీవర్‌ నౌకలు ఢీ
ఇంగ్లిష్‌ ఛానెల్‌లో ఫ్రాన్స్‌-బ్రిటన్‌ మధ్య భారత్‌-చైనా దేశాలకు చెందిన రెండు సరకు రవాణా నౌకలు 2017 జులై 1 పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి భారతీయ సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. దాదాపు 38 వేల టన్నుల పెట్రోలును తీసుకుని గ్వాటెమాలా వెళ్తున్న 600 అడుగుల పొడవైన ‘సీఫ్రాంటియర్‌’ నౌక... నెదర్లాండ్స్‌ నుంచి నైజీరియా వెళ్తున్న ‘హ్యుయాన్‌ ఎండీవర్‌’ నౌకను సముద్రం మధ్యలో ఢీకొంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గం. ఈ రెండు నౌకలూ హాంగ్‌కాంగ్‌లో నమోదయ్యాయి. 
views: 1175

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams