Current Affairs Telugu Daily

రొమ్ము కేన్సర్‌ ఔషధాన్ని విడుదల చేసిన ‘హెటెరో’
హెటెరో డ్రగ్స్‌, రొమ్ము కేన్సర్‌ చికిత్సలో వినియోగించే లపాటినిబ్‌ ట్యాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్‌ను ‘హెర్‌ట్యాబ్‌’ అనే బ్రాండు పేరుతో 250 ఎంజీ డోసులో రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. హెటెరో హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఈ ఔషధం మార్కెటింగ్‌, పంపిణీ బాధ్యత చేపడుతుంది. రొమ్ము కేన్సర్‌ బాధితుల్లో కేన్సర్‌ కణాలు విస్తరించకుండా నిరోధించటానికి లెట్రోజోల్‌ ఔషధంతో కలిసి లపాటినిబ్‌ ట్యాబ్లెట్‌ను చికిత్స కింద ఇస్తారు.
views: 828



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams