Current Affairs Telugu Daily

ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా 
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ఛైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని ఎక్స్ఛేంజీ వెల్లడించింది. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన చావ్లాను ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ‘ఇటీవలి చట్టపర ఘటనల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ డైరెక్టర్‌, బోర్డ్‌ ఛైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేశారు. వెంటనే ఇది అమల్లోకి వచ్చింది’ అని మాత్రమే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.
ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అయిన చావ్లా 2016 మార్చి 28న ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పౌరవిమానయాన కార్యదర్శి, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఛైర్‌పర్సన్‌ బాధ్యతలూ నిర్వర్తించారు. 2018 నవంబరులో యెస్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగారు.
NSE Headquarters: Mumbai
CEO: Vikram Limaye 

views: 606

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams