Current Affairs Telugu Daily

తప్పనిసరి వీక్షణ జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న పర్యాటక ప్రాంతం హంపి
అలనాటి విజయనగర సామ్రాజ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరుబయలు పర్యాటక ప్రదేశంగా సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకునే కర్ణాటకలోని హంపీ నగరానికి అరుదైన గౌరవం లభించింది. తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని పొందింది. జీవిత కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాను ‘ద న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక తన తాజా సంచికలో ప్రకటించింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 52 పర్యాటక ప్రాంతాలు ఉండగా.. హంపీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. మన దేశం నుంచి హంపీ ఒక్కటే ఎంపిక కావడం మరో విశేషం. తుంగభద్ర తీరంలో దాదాపు 26 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ చారిత్రక ప్రదేశం నేటికీ పర్యాటకుల్ని విశేషంగా   ఆకర్షిస్తోందని విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపించారు. 2016-17 సంవత్సరంలో సుమారు 5.35 లక్షల మంది హంపీని సందర్శించారు. వీరిలో 38 వేల మంది విదేశీ పర్యాటకులే ఉన్నారు.
views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams